Archive for నేపథ్యం

పడి లేచిన కడలితరంగం – పెనుగొండ లక్ష్మినారాయణ

– కోట పురుషోత్తం

పెనుగొండ లక్ష్మినారాయణను చిటికెన వేలు పట్టుకుని గుండ్లకమ్మ రైల్వేస్టేషను దగ్గరకు తీసుకుని వెళ్తున్నాడు తండ్రి. లక్ష్మినారాయణ అప్పట్లో ఫిరంగిపురంలో చదువుతున్నాడు కాబట్టి అక్కడికా పిల్లవాణ్ణి పంపాలి. ఒక బంధువు ఈ తండ్రీ కొడుక్కి ఎదురుపడి, ”ఎందుకురా చదువు చదువు అని పిల్లల కోసం అంతంత డబ్బు తగలేస్తావు? వీళ్లకేం చదువొస్తుంది రా? ఏ రోజైనా వ్యవసాయం చేసుకుని గొడ్లు మేపుకుని బతకాల్సిందే గదా. మనం రైతులమని మరిచిపోవద్దు” అన్నాడు. అనేసి పోయాడు.
ఎక్కడో మారుమూల వినుకొండ దగ్గర నూజెండ్ల మండలంలో వున్న చెరువుకొమ్ముపాలెం లక్ష్మినారాయణ వూరు. ఆ వూర్లో నుంచి పరాయి వూళ్లకు వెళ్లి చదువుకోవడం అనేది లక్ష్మినారాయణ ఇంటి నుంచే మొదలైంది. Read the rest of this entry »

Comments