July 1, 2007 at 1:15 am
· Filed under కవితానేత్రం
- బండ్ల మాధవరావు

ప్రత్యక్ష సంభాషణల నిరంతర అంతరాయాల మధ్య
ఇప్పుడు అందరం సెల్లో బందీలమయ్యాం
సంబోధనా పరికరాలైన పేర్లు
సంఖ్యలుగా మారిపోయాయి
ఆగిపోయిన సంభాషణ
తిరిగి ప్రారంభించాలంటే
తడుము కోవాల్సిందే
విచిత్రంగా ఎవరికి వాళ్ళు
మరెవరితోనో మాట్లాడుతూనే వుంటారు
నిశ్శబ్దాన్ని చీలుస్తూ
శబ్దాన్ని స్వాధీనం చేసుకున్న వాళ్లంతా
ఏదో పిచ్చి వాళ్ల లోకంలో
విహరిస్తున్నట్లుగా వుంటుంది.
Read the rest of this entry »
Permalink
July 1, 2007 at 1:14 am
· Filed under కవితానేత్రం
- డా. కాసుల లింగారెడ్డి
ఆకాశపు మబ్బు కొమ్మల మీద
వాన చినుకు చిగురు తొడిగిన
లేత వెన్నెల రాత్రి
యవ్వనపు నెలపొడుపు పొడిచినప్పుడు
విరబూసిన తొలిప్రేమ పద్మం-
జ్ఞానపు వసంతమేఘంలో తడుద్దామని
దారుల్ని తొక్కుతున్న క్షణాన Read the rest of this entry »
Permalink
July 1, 2007 at 1:13 am
· Filed under కవితానేత్రం
- దోర్నాదుల సుబ్బమ్మ
తూర్పు వాకిలి అతిథివి నువ్వు…
కాలంతో కవిత్వాన్ని చిలికి
సరస్వతీ దేవికి నైవేద్యం పెట్టావో…
సాహితీవనంలో సుగంధాన్ని పీల్చి
కవిత్వ సీతాకోకచిలుకలా ఎగిరావు
కాలం చరిత్ర మీది వజ్రసంతకం నీది Read the rest of this entry »
Permalink
July 1, 2007 at 1:12 am
· Filed under కవితానేత్రం
- డా. రూప్‌కుమార్ డబ్బీకార్

చెరిగిపోని పాదముద్రల మీద
చరిత్రను చదవడం ఎంత అద్భుతమో
పుటలు తిప్పుతున్న చేతివేళ్ళ చప్పరింతల్లో
గతకాలపు రక్తపుమరకల “ఫింగర్‌ప్రింట్స్”
ఆనవాళ్ళను వెతకడం కూడా అంతే అద్భుతం!!
చదవడం కూడా ఒక సంయోగమైతే
పదానికి, పదానికి మధ్యగల శూన్యంలో
ఉనికిని నాటుకోవడమూ Read the rest of this entry »
Permalink