Archive for వ్యాసనేత్రం

నవలాశిల్పం కొన్ని పరిశీలనలు…

-వడ్డెర చండీదాస్‌

నాటకానికీ కథకీ వున్నంత వయసులేదు, నవలకి. అవి పెద్దవి. యిది పసిది. ఐనా-రజస్వలయిన కుర్రది అర్జంటుగా హర్రీగా యెదిగి,  కట్నం యిచ్చుకోలేని తన తండ్రిని భయపెట్టినట్లు  దయ్యప్పిల్లలా తయారై కూచుంది  నవల.
యింతకీ నవల అంటే యేవిటి ? అడక్యూడని ప్రశ్న. నవల అంటే నవలే. Read the rest of this entry »

Comments (1)

విశ్వసాహిత్యంలో కథ

-గుడిపాటి వెంకటచలం

డార్విన్‌కి పూర్వం ప్రపంచ వాఙ్మయం విశ్వాసంతో నడిచింది. ఏది ఎవరు గొప్పది రాసినా కొన్ని ఆదర్శాల మీదా, మానవ ఔన్నత్యం మీదా, దైవంలో విశ్వాసం మీదా కాళ్ళు మోపి నిలిచేవి, ఇంగ్లీషులో ఆ విశ్వాసాన్ని చూపిన చివరి కవులు టెన్నిసన్‌, బ్రవ్‌నింగ్‌, మన దేశంలో వీరేశలింగంగారు. అక్కడితో సైన్స్‌ ప్రాబల్యం ఎక్కువయింది. సైన్స్‌ ప్రపంచాన్ని ఉద్ధరిస్తుందనుకొన్నారు. వాఙ్మయమూ ఆ ఆశయంతోనే ఉండింది. మొదటి ప్రపంచ యుద్ధంతోనే సైన్స్‌ దెబ్బతింది.
రెండో యుద్ధంతో పూర్తిగా ఆ విశ్వాసం పోయింది. ఆనాటినించీ ఏ ఆదర్శమూ లేదు మానవులకి. తెలుగు సారస్వతంలో, చలం విరుచుకుపడడంతో ఏ ఆదర్శమూ లేకుండా ఎగిరి పోయినాయి. అతను బోధించిన శృంగారాదర్శం గిట్టనూ గిట్టదు, చిరమైన తృప్తినీ ఇవ్వదు. Read the rest of this entry »

Comments

శ్రీరంగం నారాయణబాబు రుధిరజ్యోతిలో భావచిత్రాలు

- డా. పి.సంజీవమ్మ

శ్రీరంగం నారాయణబాబు, శ్రీశ్రీ ఇరువురూ సమకాలికులు. స్వయానా కాకపోయినా సోదరులే, ఇరువురూ అభ్యుదయ కవులే. అయినా శ్రీశ్రీ పాపులర్‌ అయినంతగా నారాయణబాబు కాలేదు. కొందరి విషయం అంతే. ఆయన శతజయంతి సంవత్సరం పూర్తి అయింది.
శ్రీశ్రీ కవిత్వం వుద్వేగంతో పరుగులు తీసేది, నారాయణబాబుది నిలిచి నిలకడగా ఆలోచింపజేసేది. శ్రీశ్రీ కవిత స్థూల దృష్టికి అందుతుంది, నారాయణబాబుది సూక్ష్మదృష్టికి తప్ప అందనిది, గాఢత పెనవేసుకున్న కవిత. ఆయన్ని ఆధునిక తెలుగు కవుల్లో ప్రథమ శ్రేణిలో నిలపడానికి ‘రుధిర జ్యోతి’ కవితా సంకలనం ఒక్కటి చాలు. Read the rest of this entry »

Comments (1)

ఆరు పదుల తెలుగు కవిత

- డాక్టర్‌ ద్వా.నా. శాస్త్రి

స్వాతంత్య్రోద్యమం, పాశ్చాత్య దేశాలలో పారిశ్రామిక విప్లవం, సాంఘిక పునరుజ్జీవన ఉద్యమం, పాశ్చాత్య రాజకీయ, ఆర్థిక, సామాజిక సిద్ధాంతాలు ఆధునిక కవిత్వావిర్భావానికి దోహదం చేశాయి. మన రాష్ట్రంలో తలెత్తిన రాజకీయ పార్టీలు, సంస్కరణోద్యమాలు తెలుగు కవిత్వ స్వరూపాన్ని మార్చివేశాయి. అభినవ కవిత్వం కొత్త మలుపులతో కొత్త పుంతలు తొక్కింది. 1947 నుంచి నేటివరకు తెలుగు కవిత బహుముఖాలుగా వెలువడుతూ- విస్తరిస్తూ తెలుగు భాషా వైశిష్ట్యాన్ని, తెలుగువారి జీవన సమస్యల్ని, పరిపాలకుల దురాగతాల్ని, జీవన తత్వాల్నీ చాటి చెప్తూనే వుంది. ఎంత ఆధునికమైనా తెలుగు కవిత్వం మూలాల్ని విస్మరించలేదు. నూతన ప్రక్రియలతో పాటు ప్రాచీన ప్రక్రియలైన పురాణం, కావ్యం, శతకం, దండకం, అవధానం వంటివి సమాంతరంగా వెలువడుతూ ఉండటం విశేషం.

Read the rest of this entry »

Comments (4)

Realistic fiction : A Narration of Drought

A discourse analysis of “Inupa gajjela thalli”
- Chandra Latha

Natural calamities often leave with unnatural human experiences. Telugu writers narrated their experiences of prolonged drought that adversely affected Ananthapur, in the form of stories and published an anthology “Inupa gajjela thalli” (Mother of Iron anklets)
Effects of Drought descend on everything related to life… from human condition, cattle population to ecological disturbances and socio – economic breakdowns. Struggle for survival brings in inevitable migration of homeland. A sudden turmoil in intrapersonal relations, loneliness, loss of family members and kinship, depression, anxiety, fear, disruption of social networks, increased crime and violence. Girl children and women are sold or sent to work as far as the gulf. Women who are left alone often become preys for the living men in the village like money lenders, middle men.
No experience is pleasant. This is drought. And, this is the back drop for the reflections and recreations of fiction writers in the anthology. Read the rest of this entry »

Comments (1)