Archive for సమీక్షానేత్రం

”అస్తిత్వానికి అద్దం పట్టిన స్వప్న శబ్దం”

- కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి

‘హైకూ’ కవిగా కవితాలోకంలోకి అడుగిడిన ‘రూప్‌కుమార్‌ డబ్బీకార్‌’ ‘సంపెంగ లోలకం’ హైకూల సంపుటితో సాహిత్య పరిమళాల్ని పాఠకులకు పంచారు. ఇప్పుడు ‘స్వప్న శబ్దం’ కవితాసంపుటిలో పల్లె అనుబంధాల్ని ఆరవోశారు. ఆత్మగల కవిత్వాన్ని అందించారు. తెలంగాణ అస్తిత్వాన్ని ఆగమయిపోకుండా కాపాడుకోవాలనే తపనతో పిలుపునిచ్చారు. నిద్రాణమైయున్న తెలంగాణ యువతను తట్టిలేపే ప్రయత్నం చేశారు.
Read the rest of this entry »

Comments

వ్యదార్థ జీవుల జీవనయానం – పూణే ప్రయాణం

తను శవమై ఒకరికి వశమై, తనువు పుండై ఒకరికి పండై, ఎప్పుడూ ఎడరై, ఎందరికో ఒయాసిస్సై అన్న అలిశెట్టి ప్రభాకర్‌ మాటలు ఎప్పటికీ ఆరిపోని రక్తరేఖలు. ఈ రేఖలు మన సరిహద్దులు దాటి పొట్ట కూటి కోసం ప్రక్క రాష్ట్రాలకు వలస వెళ్ళి వంచనకు, వేదనకు, గురవుతూ, వాడిపోతూ, గుభాళింపు కోల్పోతూ, నలిగిపోతున్న మల్లెలు. ఈ మల్లెల సువాసనలు దోచుకోవడనికి సొమ్ము చేసుకోవడనికి ఎవరెవరు ఏఏ వలవిసిరి వారిని ఎలా ఈ కూపంలో దించుతారో సవివరంగా, వార్తా కథనాలుగా వ్రాసిన గంగాధర్‌కు జీవితం విలువ అంటే ఏమిటో బాగా తెలుసనిపిస్తుంది. ఈ ‘పూణే ప్రయాణం’లో పూణేలో మగ్గిపోతున్న వ్యభిచారుల జీవితం ఎలా వుంటుందో వివరంగా పొందుపరిచాడు. Read the rest of this entry »

Comments