Archive for కథానేత్రం

The Dawn

Chukka podichindi (చుక్క పొడిచింది) -పాలగిరి విశ్వప్రసాద్

Translation: Rachaputi Ramesh

The entire place resembled a house of death. It was the third day from the murder. The sons of the President of the village and other key members of their group were on the run.
Sujatha was sitting by a pillar in the courtyard, throwing forlorn looks. She was surrounded by the women folks comprising of near and dear. Ravindra Reddy’s mother was lying unconscious on the bed. Ravindra’s two brothers were supervising outdoor works. Read the rest of this entry »

Comments (1)

భూమి

- పి. చంద్రశేఖర ఆజాద్

[సాహిత్య నేత్రం ఉత్తమ కథా పురస్కార పోటీలు - 2007లో జనరల్‌ కేటగిరి కింద ప్రథమ బహుమతి రూ. 5,000/-లు పొందిన కథ]

నేనెవర్ని?
ఈ ప్రశ్నకు సమాధానం నేనే వెతుక్కోవాలి
ఇందులో దళారులకు చోటు లేదు
  
జీవితమంటే ఫేడ్‌ ఇన్‌ – ఫేడ్‌ అవుట్‌
లాంగ్‌షాట్‌ – మిడ్‌షాట్‌ – టైట్‌ క్లోజ్‌ – రష్యన్‌ యాంగల్‌
ఎన్ని రకాలుగా చూడవచ్చునో!
నా కలల ప్రపంచం సినిమా
సినిమాకో లాంగ్వేజ్‌ వుంది బ్రదర్‌ – గ్లామరుంది
మీకు గ్లామర్‌ తప్ప గ్రామర్‌ అవసరం లేదు
భయ్యా ఏదైనా భూమి నుండి మొదలై ఆకాశాన్ని చేరాలి
  
భూమి వాస్తవమా – భ్రాంతా! Read the rest of this entry »

Comments

ఇతిహాసం

-వి. పోతన్న

[సాహిత్య నేత్రం ఉత్తమ కథా పురస్కార పోటీలు - 2007లో జనరల్‌ కేటగిరి కింద ద్వితీయ బహుమతి రూ. 3,000/-లు పొందిన కథ]

అది పెద్ద గుట్ట. జనం కొండ అని పిలుస్తుంటారు.
గుట్ట నెత్తి మీద ఉన్న శివాలయం దూరం నుంచీ చూస్తే కిరీటంలాగా కనిపిస్తుంది.
గుట్టపైకి వెళ్ళేదారి ‘నల్లనాగు పయనం’లా ఉంటుంది.
శివుడు ఏ మహారాజుకు ‘కల’లో కనిపించి చెప్పాడో! ఎవరు ఆ ఆలయాన్ని నిర్మించారో! చెప్పటానికి సరైన చారిత్రక ఆధారాలు లేవుగానీ… పర్యాటక శాఖ పుణ్యమా! అంటూ ‘కాలం కడుపులో జీర్ణమవుతున్న’ ఆలయం కొన్నేళ్ళ క్రితం  పునరుద్ధరించబడింది. పుణ్యక్షేత్రంగా, యాత్రాస్థలంగా గుర్తించబడింది. నగరానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో, ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఆ దేవాలయంలో… ‘సతీదేవి’ వియోగంతో శివుడు (శివలింగం) యోగముద్ర ధరించినట్లు కనిపిస్తాడు.
ఆ గుట్టకు దిగువభాగంలో Read the rest of this entry »

Comments (1)

గుండె గొంతులో కొట్లాడతాది

-సుంకోజి దేవేంద్రాచారి

[సాహిత్య నేత్రం ఉత్తమ కథా పురస్కార పోటీలు - 2007లో జనరల్‌ కేటగిరి కింద ద్వితీయ బహుమతి రూ. 3,000/-లు పొందిన కథ]

”సా..రీ..గా..మా..పా..దా..నీ..సా…” పక్కింటి పిల్లలిద్దరూ వరండాలో కూర్చుని సంగీతం సాధన చేస్తున్నారు.
”దిక్కులు చూస్తున్నావేం… అక్కతో పాటు పాడు…” మాటలు వినిపించాయి.
”పాడుతున్నానమ్మా…”
వారంలో రెండు రోజులు సాయంత్రాల్లో వాళ్ళు సంగీత సాధన చేస్తుంటారు.
రాధకు వంటగదిలోకి పిల్లల సాధన స్పష్టంగా వినిపిస్తోంది. తను కూడా వంట చేస్తూ తనకు తెలీకుండానే వారితోపాటు మెల్లిగా
”సా..రీ..గా..మా..పా..దా..నీ..సా…” అంటూ పాడుతోంది. Read the rest of this entry »

Comments

తూరుపు కొమ్మలు

-వేంపల్లి గంగాధర్

[సాహిత్య నేత్రం ఉత్తమ కథా పురస్కార పోటీలు - 2007లో జనరల్‌ కేటగిరి కింద ద్వితీయ బహుమతి రూ. 3,000/-లు పొందిన కథ]

కాలి దావకు అవతల గంగమ్మ గుడికి కాస్త దూరంగా వుండే విశాలమైన స్థలంలోని చింతచెట్టు గలగలమని ఈదురుగాలికి శబ్దం చేస్తా వుంది. పూతకాలంతో చెట్టంతా గుబాళిస్తా వుంది. ఉదయాన్నే గంపలోళ్ళు చిగుర్లు కోసుకొని పోవడంతో కిందవుండే కొమ్మలన్నీ గిల్లేసినట్లు వున్నాయి. ఎగబాగి విస్తరించిన తూరుపు కొమ్మలకు బావి చేతాడుతో వేసిన ఊయల పిల్లలెవరూ రాకపోవడంతో మౌనంగా వుంది. దిగువ కొట్టాల్లోని బడి ఇంకా వదిలారో లేదో తెలియదు. ఒకవేళ వదిలేసి వుంటే ఇళ్ళకొచ్చిన పిల్లలు పుస్తకాలను ఏ గూట్లోనో పడేసి ఈ ఊయల దగ్గర వంతులవారీగా ఊగడానికి గొడవపడ్తూ వుండేవారు. సాయంత్రం ఎండలో చెట్టు కొత్త కాంతిని పులుముకుంటోంది. Read the rest of this entry »

Comments

తెలుగు పతాకం

-జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి

[సాహిత్య నేత్రం ఉత్తమ కథా పురస్కార పోటీలు - 2007లో జనరల్‌ కేటగిరి కింద ద్వితీయ బహుమతి రూ. 3,000/-లు పొందిన కథ]

నేను పుట్టుకచే ఆంగ్లేయుడను. అయిననూ ఆంధ్రము నేర్చితిని. మా మిత్ర సమూహమునందు నేను గానము చేయు భాగవత పద్యములు గాని అన్నమయ్య పదములుగాని నాకు ప్రత్యేకమైన గుర్తింపునిచ్చుచుండును. అది నాకు గర్వకారణము. అందులకే నాయందు ఆంధ్రమనిన అభిమానమున్నది. అంతకు మించిన ఆత్మీయతా గౌరవ భావములున్నవి. బాల్యమునందు మా తల్లి గారైన లూసీమాత నాకు అక్షరాభ్యాసము గావించిరి. ఏదేని ఒక భాష యొక్క వికాసము అవసరమగు అన్య భాషా పదములను సైతము విలీనము చేసికొనుచు ముందుకు సాగుటయందే ఇమిడియుండును. కావున నేటి తెలుగు నేను ప్రయోగించు భాషవలెనుండదని నాకు తెలియును. ఏలనన నా తెలుగు, గ్రంథముల నుండి నేర్చినదేగానీ ప్రయోగము వలన అబ్బినది కాదు.

Read the rest of this entry »

Comments (4)

గాలి గంగమ్మ

- వి.ప్రతిమ

[సాహిత్య నేత్రం ఉత్తమ కథా పురస్కార పోటీలు - 2007లో స్త్రీవాద కేటగిరీ కింద ప్రథమ బహుమతి రూ. 5,000/-లు పొందిన కథ]

”వీణా ఏం మాట్లాడ్తున్నావ్‌ నువ్వు?… ఎవరితో మాట్లాడుతున్నావో గుర్తుందా?… నోటికెంతొస్తే అంతా అనేయడమేనా పెద్దా, చిన్నా లేకుండా” నా కంఠంలోని తీవ్రతకి కొంత జంకినట్టయి… మళ్ళీ తను వెనక్కి తగ్గకూడదనుకున్నదో ఏమో,
”నీకు తెలీదత్తా… యింత దూరం నుండి నిన్ను పిలిపించి ఇక్కడ మధ్యస్థం పెట్టించాల్సి వచ్చిందంటే నువ్వే ఆలోచించుకో” అన్నది అంతే తీవ్రంగా…
ఆ పిల్ల కళ్ళు క్రోధంతో ఎరుపెక్కి ముక్కుపుటాలు ఆవేశంతో అదురుతున్నాయి… అసలే పాలుగారే చర్మమేమో బుగ్గలు రోజా రంగులోకి మారిపోయాయి. వాకిట్లోని కొబ్బరాకులు కిటికీలో నుండి వీధిలైటు వెలుతురును మోసుకొచ్చి వీణ మొహం మీది నుండి కదలాడుతూ డైనింగ్‌ టేబిల్‌ మీద కుప్ప పోస్తున్నాయి… Read the rest of this entry »

Comments

The Mire

[ప్రముఖ కథారచయిత సింగమనేని నారాయణ వ్రాసిన ఊబి కథకు కీ.శే. వల్లంపాటి వెంకట సుబ్బయ్య ఆంగ్లానువాదం]

It is raining.. incessantly.

A shower of silver needles !

Narappa is watching it without batting an eyelid.

The rainwater is swirling through the street. Read the rest of this entry »

Comments