Archive for July, 2007

నవలాశిల్పం కొన్ని పరిశీలనలు…

-వడ్డెర చండీదాస్‌

నాటకానికీ కథకీ వున్నంత వయసులేదు, నవలకి. అవి పెద్దవి. యిది పసిది. ఐనా-రజస్వలయిన కుర్రది అర్జంటుగా హర్రీగా యెదిగి,  కట్నం యిచ్చుకోలేని తన తండ్రిని భయపెట్టినట్లు  దయ్యప్పిల్లలా తయారై కూచుంది  నవల.
యింతకీ నవల అంటే యేవిటి ? అడక్యూడని ప్రశ్న. నవల అంటే నవలే. Read the rest of this entry »

Comments (1)

విశ్వసాహిత్యంలో కథ

-గుడిపాటి వెంకటచలం

డార్విన్‌కి పూర్వం ప్రపంచ వాఙ్మయం విశ్వాసంతో నడిచింది. ఏది ఎవరు గొప్పది రాసినా కొన్ని ఆదర్శాల మీదా, మానవ ఔన్నత్యం మీదా, దైవంలో విశ్వాసం మీదా కాళ్ళు మోపి నిలిచేవి, ఇంగ్లీషులో ఆ విశ్వాసాన్ని చూపిన చివరి కవులు టెన్నిసన్‌, బ్రవ్‌నింగ్‌, మన దేశంలో వీరేశలింగంగారు. అక్కడితో సైన్స్‌ ప్రాబల్యం ఎక్కువయింది. సైన్స్‌ ప్రపంచాన్ని ఉద్ధరిస్తుందనుకొన్నారు. వాఙ్మయమూ ఆ ఆశయంతోనే ఉండింది. మొదటి ప్రపంచ యుద్ధంతోనే సైన్స్‌ దెబ్బతింది.
రెండో యుద్ధంతో పూర్తిగా ఆ విశ్వాసం పోయింది. ఆనాటినించీ ఏ ఆదర్శమూ లేదు మానవులకి. తెలుగు సారస్వతంలో, చలం విరుచుకుపడడంతో ఏ ఆదర్శమూ లేకుండా ఎగిరి పోయినాయి. అతను బోధించిన శృంగారాదర్శం గిట్టనూ గిట్టదు, చిరమైన తృప్తినీ ఇవ్వదు. Read the rest of this entry »

Comments

పడి లేచిన కడలితరంగం – పెనుగొండ లక్ష్మినారాయణ

– కోట పురుషోత్తం

పెనుగొండ లక్ష్మినారాయణను చిటికెన వేలు పట్టుకుని గుండ్లకమ్మ రైల్వేస్టేషను దగ్గరకు తీసుకుని వెళ్తున్నాడు తండ్రి. లక్ష్మినారాయణ అప్పట్లో ఫిరంగిపురంలో చదువుతున్నాడు కాబట్టి అక్కడికా పిల్లవాణ్ణి పంపాలి. ఒక బంధువు ఈ తండ్రీ కొడుక్కి ఎదురుపడి, ”ఎందుకురా చదువు చదువు అని పిల్లల కోసం అంతంత డబ్బు తగలేస్తావు? వీళ్లకేం చదువొస్తుంది రా? ఏ రోజైనా వ్యవసాయం చేసుకుని గొడ్లు మేపుకుని బతకాల్సిందే గదా. మనం రైతులమని మరిచిపోవద్దు” అన్నాడు. అనేసి పోయాడు.
ఎక్కడో మారుమూల వినుకొండ దగ్గర నూజెండ్ల మండలంలో వున్న చెరువుకొమ్ముపాలెం లక్ష్మినారాయణ వూరు. ఆ వూర్లో నుంచి పరాయి వూళ్లకు వెళ్లి చదువుకోవడం అనేది లక్ష్మినారాయణ ఇంటి నుంచే మొదలైంది. Read the rest of this entry »

Comments

శ్రీరంగం నారాయణబాబు రుధిరజ్యోతిలో భావచిత్రాలు

- డా. పి.సంజీవమ్మ

శ్రీరంగం నారాయణబాబు, శ్రీశ్రీ ఇరువురూ సమకాలికులు. స్వయానా కాకపోయినా సోదరులే, ఇరువురూ అభ్యుదయ కవులే. అయినా శ్రీశ్రీ పాపులర్‌ అయినంతగా నారాయణబాబు కాలేదు. కొందరి విషయం అంతే. ఆయన శతజయంతి సంవత్సరం పూర్తి అయింది.
శ్రీశ్రీ కవిత్వం వుద్వేగంతో పరుగులు తీసేది, నారాయణబాబుది నిలిచి నిలకడగా ఆలోచింపజేసేది. శ్రీశ్రీ కవిత స్థూల దృష్టికి అందుతుంది, నారాయణబాబుది సూక్ష్మదృష్టికి తప్ప అందనిది, గాఢత పెనవేసుకున్న కవిత. ఆయన్ని ఆధునిక తెలుగు కవుల్లో ప్రథమ శ్రేణిలో నిలపడానికి ‘రుధిర జ్యోతి’ కవితా సంకలనం ఒక్కటి చాలు. Read the rest of this entry »

Comments (1)

వెరవను.. రచన ఆపను… తస్లీమా నస్రీన్‌

దాడులు చేస్తే వెనుకంజ వేయబోనని, ఏదేమైనా తన అభిప్రాయాల వ్యక్తీకరణను ఆపననీ బంగ్లా రచయిత్రి తస్లీమా నస్రీన్‌ స్పష్టం చేశారు. సాధారణ ప్రజల ఆదరాభిమానాలు తనకు అండగా ఉన్నాయని చెప్పారు. గురువారం హైదరాబాద్‌లో మజ్లిస్‌ నేతల దాడికి గురైన తర్వాత ఆమె హైదరాబాద్‌ విమానాశ్రయంలోనూ, కోల్‌కతా చేరిన తర్వాత ఫోన్లోను విలేఖరులతో మాట్లాడారు. Read the rest of this entry »

Comments

తస్లీమా సంఘీభావ ప్రదర్శన

తస్లీమానస్రీన్‌పై హైదరాబాదు ప్రెస్‌క్లబ్‌లో మజ్లిస్‌ శాసనసభ్యుల నాయకత్వంలో జరిగిన అనాగరిక దాడిని నిరసిస్తూ నగరంలో శనివారం ఉదయం అరసం, విరసం, ఎపియుడబ్ల్యూజెల ఆధ్వర్యంలో ప్రజా ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శన గుంటూరు అంబేద్కర్‌ విగ్రహం సెంటర్‌ నుండి ట్రావెలర్స్‌ బంగళా వరకు కొనసాగింది. Read the rest of this entry »

Comments

తస్లీమా నస్రీన్‌పై అనాగరిక దాడి

తస్లీమా రచించిన ‘శోధ్‌’ పుస్తకాన్ని హైదరాబాద్‌కు చెందిన రచయిత్రి వెనిగళ్ల కోమల ‘చెల్లుకు చెల్లు’ పేరుతో తెలుగులోకి అనువదించారు. దీంతోపాటు మరో పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని రేషనలిస్ట్‌ వాయిస్‌ పబ్లికేషన్‌ సంస్థ, శాస్త్రీయ పరిశీలనా కేంద్రం 09.08.2007వ తేదీ గురువారం ఏర్పాటు చేశాయి. హైదరాబాద్‌ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌ దీనికి వేదిక. Read the rest of this entry »

Comments

‘కీర్తిశేషులు’ భమిడిపాటి

ప్రముఖ సినీ రచయిత, ఆంధ్ర – ఆంగ్లభాషలలో దిట్ట, గణిత మేధావి భమిడి పాటి రాధాకృష్ణ (78సం||లు) సెప్టెంబర్‌ 4వ తేది రాజమండ్రిలోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో కన్నుమూశారు.  భమిడిపాటి 150 సినిమాలకు మాటలు, కథలు అందించారు. Read the rest of this entry »

Comments

పాత్రికేయుడు, అనువాద రచయిత సహవాసి కన్నుమూత

ప్రముఖ పాత్రికేయుడు, రచయిత, అనువాదకుడు జంపాల ఉమామహేశ్వరరావు బుధవారం 29.08.07 కన్నుమూశారు. ఆయన ‘సహవాసి’ అనే పేరుతో పాఠకలోకానికి సుపరిచితులు. Read the rest of this entry »

Comments

సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో జాషువా వర్ధంతి

గుర్రం జాషువా

గుర్రం జాషువా

తెలుగు సాహిత్యలోకంలో తన కవితాశక్తితో నిలిచిన సాహితీమూర్తి అని జాషువాకు పలువురు వక్తలు నివాళులర్పించారు. గుర్రం జాషువా 36వ వర్ధంతి సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో టాంక్‌బండ్‌పై గల జాషువా విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించబడింది. ఆ రోజు ఉదయం 10.30 గంటలకు సాహితీ స్రవంతి రాష్ట్ర కన్వీనర్‌ తెలకపల్లి రవి జాషువా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభ్యుదయ సాహిత్యానికి పూర్వమే సామాజిక స్పృహ, నిబద్ధతలతో జాషువా కవిత్వం పండించారని, Read the rest of this entry »

Comments

« Previous entries Next Page » Next Page »