కడలి తీరంలో కవిత ఉప్పెన

అల్లరి చేసే అలల సందడి.. ఎగిసి పడే నీటి తుంపర్లు.. వీస్తున్న చల్లని పవనాలు… కడలి హోరు నడుమ… ”సముద్రమే” ప్రధానాంశంగా నెల్లూరు జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రాష్ట్రంలోనే ప్రప్రథమంగా వినూత్నంగా గురుపూర్ణిమ వంటి విశిష్టమైన రోజున నిర్వహించిన ఈ కవిసంమేళనానికి నెల్లూరు జిల్లా, విడవలూరు మండలం, రామతీర్థం సమీపంలో గల పొన్నపూడి – పెద్దపాళెంలోని విలక్షణమైన సముద్రతీరం వేదిక అయింది.

'రాయలసీమలో వాన - తెలంగాణ' పుస్తకావిష్కరణ

'రాయలసీమలో వాన - తెలంగాణ' పుస్తకావిష్కరణ


రాష్ట్రంలోని పలుప్రాంతాల నుంచి విచ్చేసిన 35 మంది కవులు, జిల్లా అధికారులు, స్థానిక పెద్దలు, మత్స్యకారులతో ఆరోజంతా కళకళలాడింది. ఈ కార్యక్రమానికి విడవలూరు తహసిల్‌దారు, నెరసం సంయుక్త కార్యదర్శి, ప్రముఖ కథారచయిత పోట్లూరి సుబ్రహ్మణ్యం ఏర్పాటు, పర్యవేక్షణ చేయగా, సాధారణంగా సభలు పట్టణాలలోని సమావేశ మందిరాల్లో జరుగుతుండే అలవాటుకు భిన్నంగా ఈసారి ప్రకృతిలో మమేకం చేస్తూ సముద్ర తీరంలో జరిపిన ప్రత్యేక కవి సమ్మేళనాన్ని నెరసం అధ్యక్షుడు డాక్టర్‌ ఈదూరు సుధాకర్‌, ప్రధాన కార్యదర్శి పెరుగు రామకృష్ణ, సమర్థవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దాదాపు 35 మంది కవులు తమ కుటుంబ సభ్యులతో సహా నెల్లూరు నుండి ప్రత్యేకబస్సులో ‘కవితాయాత్ర’ చేసి రావడం ప్రత్యేక విశేషం.
”కడలి తీరంలో కవితల ఉప్పెన” పేరుతో రూపొందించిన ఈ కార్యక్రమం ఆద్యంతం మనోహరంగా సాగింది. సముద్రఘోష మధ్య చేయి చాచితే అందేంత దూరంలో ఎగిసిపడుతున్న కెరటాలను చూస్తూ ఎందరో కవులు హృద్యంగా, భావుకకతతో కవితా గానం చేసారు. ఆ కవితలు కడలితీరంలో ఉప్పొంగిన కవితా కెరటాలై అందరి మనసు లోతులను తాకి పరవశింప చేసాయి.
ఈ సందర్భంగా ప్రముఖ కవి, సాహితీ విమర్శకులు డాక్టర్‌ అద్దేపల్లి రామ్మోహనరావు ఆధునిక సాహిత్యంలో ”సముద్ర నేపథ్యం” అంశంపై కీలక ఉపన్యాసం చేస్తూ, సూర్యుడు, సముద్రం ఈ రెండూ సృష్టిలో శాశ్వతమైన ప్రతీకలన్నారు. ఏ కవి అయినా ఈ రెండు ప్రతీకల్ని తమ కవిత్వంలో వినియోగించక తప్పదన్నారు. ”మనిషి సముద్రం – కవిత్వం సముద్రం – జీవితం సముద్రం” అంటూ సముద్రానికి, మనిషికి, జీవితానికి ఉన్న అనుబంధాన్ని విశదీకరించారు. కవుల మనసుల్లో, భావనల్లో సముద్రానికి ఒక ప్రత్యేక స్థానం ఎప్పుడూ వుందని, తెలుగు సాహిత్యంలో ప్రఖ్యాతి గాంచిన కవులందరూ కడలిపై కమనీయ భావాలను వ్యక్తీకరించి ఉన్నారని అన్నారు. ప్రసిద్ధ కవులు విశ్వనాథ, అడవి బాపిరాజు, వేదుల తదితరులు వారి కవిత్వాల్లో సముద్రాన్ని అత్యధ్భుతంగా వర్ణించి వున్నారు. సముద్రం  చైతన్యానికి ప్రతిరూపమని, కవి కూడా సముద్రం లాగానే చైతన్యంగా ఉండాలని కోరారు.
అనంతరం అనంతపురంకు చెందిన ప్రముఖకవి వై. శ్రీరాములు రచించిన ”రాయలసీమలో వాన – తెలంగాణ” అన్న దీర్ఘ కవితా పుస్తకాన్ని అద్దేపల్లి ఆవిష్కరించారు. ఈ కావ్యాన్ని రచయిత శ్రీరాములు హైదరాబాద్‌ నుండి విచ్చేసిన ప్రముఖ కవయిత్రి శైలజా మిత్రకు అంకితమిచ్చారు.  ఈ గ్రంథాన్ని ప్రముఖ కవి కొండిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి సమీక్షించారు.

కడలి తీరంలో కవి సమ్మేళనం

కడలి తీరంలో కవి సమ్మేళనం

జిల్లా రచయితల చేత ఇలాంటి కవితాయాత్ర చేయించి, ప్రకృతిలో మమేకం చేసే కార్యక్రమాన్ని నిర్వహించాలన్నది తను 8 ఏళ్ళుగా కంటున్న కల అని, అది ఈ రోజు సాకారమైనదని నెరసం ప్రధాన కార్యదర్శి ఉద్విగ్నంగా ప్రకటించి కవి సమ్మేళనాన్ని శ్రీ వై. శ్రీరాములు చేత ప్రారంభింప చేయించారు. ‘ఒక వాన, ఎన్నో నదులు, ఒకే సముద్రం’ అనే ఆయన విలక్షణ కవితతో సముద్రతీర కవి సమ్మేళనాన్ని ప్రారంభించారు. తర్వాత నెరసం అధ్యక్షులు డాక్టర్‌ సుధాకర్‌ సునామీ శీర్షికతో కవిత వినిపించారు. అటుపిమ్మట డాక్టర్‌ పెళ్ళకూరి జయప్రద ”జ్ఞాపకాలవల”, కోసూరి రవికుమార్‌ (దాచేపల్లి – గుంటూరు) ‘అమ్మతనం’, కొండిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి (కనిగిరి-ప్రకాశం జిల్లా) ‘ఆ తీరాన’, షేక్‌ ఖాదర్‌ షరీఫ్‌ (సోమశిల) ‘సముద్రం ప్రవహించదు’, వి. ప్రతిమ (నాయుడుపేట) ‘సముద్రప్రేమ’, యస్‌. గోపాల్‌ (ఒజిలి-రాజుపాలెం) ‘సముద్రం – నేను’, పెల్లూరి సునీల్‌ (కోట) ‘సముద్రం ఒక మృత్యు ఘోష’, పెరుగు  రామకృష్ణ – ‘జాలరి’, పోట్లూరి సుబ్రహ్మణ్యం ‘సముద్రం ఒక ఫిలాసఫర్‌’, శైలజామిత్ర (హైదరాబాద్‌) ‘స్మృతి సీమ’, పాతూరి అన్నపూర్ణ ‘కడలి’, జి. కృష్ణవేణి (గూడూరు) ‘గంగపుత్రుల కల్పవల్లి సముద్రం’ ఇలా విభిన్న శీర్షికలతో సముద్రాన్ని అనేక కోణాలలో ఆవిష్కరించారు. ఇంకా ఈ కవి సమ్మేళనంలో డాక్టర్‌ డి.యల్‌. సుహాసిని, మోపూరు పెంచల నరసింహం, పెర్నింబేటి అన్నపూర్ణ, దేవరాయపల్లి నాగార్జునాచారి, వంజవాక, సతీష్‌కుమార్‌ రెడ్డి, అనురాధా రామకృష్ణ, వై. శైలజ, వై. రాఘవయ్య, ఎద్దల లలిత, గుండాల నరేందర్‌బాబు, రాఘవాచారి, ఊరుబిండి సుబ్రహ్మణ్యశాస్త్రి, రత్న ప్రసాద్‌, యస్‌. రామారావు, జంజ్యం కోదండరామయ్య, ఐ. దయాకర్‌ రెడ్డి, నాగరాజు, మద్దూరి శ్రీనివాసులు, యస్‌. రాజేశ్వరి, కె.వి. రమ్య తమ కవితలతో అలరించారు.

Leave a Comment

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో