కవిత్వశిల్పి ‘గుంటూరు శేషేంద్ర’

- గుంటూరు శేషేంద్ర సంస్మరణ సభలో మాట్లాడుతున్న బండి నారాయణస్వామి, ప్రక్కన రచయితలు వై. శ్రీరాములు, వి. చంద్రశేఖర శాస్త్రి, మల్లెల నరసింహమూర్తి
సామాన్యులకు సైతం అర్థమయ్యే విధంగా కవిత్వాన్ని మలచిన కవిత్వశిల్పి గుంటూరు శేషేంద్రశర్మ అని, కవిత్వం మరుగున పడే సమయంలో కవిత్వపు కాంతులను వెదజల్లిన గొప్ప కవులలో ఒకరని ఎస్కేయూ తెలుగు ఆచార్యులు రాచపాళెం చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శనివారం ‘స్పందన అనంత కవులవేదిక’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శేషేంద్ర సంస్మరణ సభకు చంద్రశేఖర్‌శాస్త్రి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రాచపాళెంతో పాటు మల్లెల నరసింహమూర్తి, బండి నారాయణస్వామి లు మాట్లాడారు. కవిత్వానికి, అకవిత్వానికి తారతమ్యం తెలిపి… అసలైన కవిత్వానికి నాంది పలికిన మహాకవి శేషేంద్ర అన్నారు. భావవాదం, భౌతికవాదం వేర్వేరు కాదు… ఏదో ఒక సమయంలో అవి కలుస్తాయని, కవిత్వంలో అనువాదం తప్పనిసరి అని చెప్పిన కవి అని కొనియాడారు. కార్యక్రమంలో కవులు ఉద్దండం చంద్రశేఖర్, శ్రీరాములు, శ్రీనివాస్, దీవెన, స్నేహ పాల్గొన్నారు.