‘మనసు కురిసిన ముత్యాలు’ ఆవిష్కరణ సభ

మనసు కురిసిన ముత్యాలు
పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలో సాహితీ సంస్థ శ్రీ నన్నయభట్టారక పీఠం ఆధ్వర్యంలో ది. 15.6.07న కవిశ్రీ మోహనప్రసాద్ రచించిన ‘మనసు కురిసిన ముత్యాలు’ కవితాసంపుటి గ్రంధావిష్కరణ జరిగినది. సభకు ‘అభినవ కృష్ణరాయ’ డా. జి.యస్వీ.ప్రసాద్ అధ్యక్షత వహించగా పీఠం కార్యదర్శి శ్రీ సుశర్మ స్వాగతం పలికారు. ప్రముఖ ఆడిటర్ శ్రీ జె.ఎస్.సుబ్రహ్మణ్యం సభ ప్రారంభం గావించగా, రామకృష్ణ సేవాసమితి కార్యదర్శి డా. టి.రామబ్రహ్మం ‘మనసు కురిసిన ముత్యాలు’ కవితా సంపుటిని ఆవిష్కరించారు. ‘ప్రజాకవి’ డా. అద్దేపల్లి రామమోహనరావు గ్రంథసమీక్ష చేశారు. పుస్తక ప్రచురణకు ఆర్థిక సౌజన్యం సమకూర్చిన శ్రీ ఎస్.ఇ.సి.ఎస్.బోసుబాబును పలువురు సాహితీ ప్రముఖులు అభినందించారు. అనంతరం గ్రంథ సమీక్షకులు డా. అద్దేపల్లి రామమోహనరావును, కృతికర్త కవిశ్రీ మోహనప్రసాద్‌ను, కృతిభర్త శ్రీ ఎస్.ఇ.సి.ఎస్.బోసుబాబును శ్రీ నన్నయ భట్టారక పీఠం ఘనంగా సత్కరించింది.