‘కీర్తిశేషులు’ భమిడిపాటి
ప్రముఖ సినీ రచయిత, ఆంధ్ర – ఆంగ్లభాషలలో దిట్ట, గణిత మేధావి భమిడి పాటి రాధాకృష్ణ (78సం||లు) సెప్టెంబర్ 4వ తేది రాజమండ్రిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. భమిడిపాటి 150 సినిమాలకు మాటలు, కథలు అందించారు.
ఆయన ఆఖరిచిత్రం ‘నారీ నారీ నడుమ మురారీ’. భమిడిపాటి రచించిన ‘కీర్తిశేషులు’ నాటిక నాటక రంగంలో చాలా ప్రసిద్ధమైంది. 5 వేల సంవత్సరాల క్యాలెండర్‌ను క్రీస్తు పూర్వం 45 నుండి క్రీస్తు శకం 5555 వరకు రూపొందించి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందారు. ఈ క్యాలెండర్‌కు ఆయన తన ఇంటి పేరునే పెట్టారు భమిడిపాటి హిందీ, కన్నడ, తమిళ భాషలలో కూడా రచనలు చేశారు. ఆయన మృతికి సాహిత్యనేత్రం శ్రద్ధాంజలి ఘటిస్తోంది.