తస్లీమా సంఘీభావ ప్రదర్శన

తస్లీమానస్రీన్‌పై హైదరాబాదు ప్రెస్‌క్లబ్‌లో మజ్లిస్‌ శాసనసభ్యుల నాయకత్వంలో జరిగిన అనాగరిక దాడిని నిరసిస్తూ నగరంలో శనివారం ఉదయం అరసం, విరసం, ఎపియుడబ్ల్యూజెల ఆధ్వర్యంలో ప్రజా ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శన గుంటూరు అంబేద్కర్‌ విగ్రహం సెంటర్‌ నుండి ట్రావెలర్స్‌ బంగళా వరకు కొనసాగింది.
ప్రదర్శనలో ‘తస్లీమాకు రక్షణ కల్పించాలి. మజ్లిస్‌ శాసనసభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేయాలి, భావ ప్రకటన స్వేచ్ఛను పరిరక్షించాల’ని పెద్దపెట్టున నినాదాలు చేశారు. ప్రదర్శన అనంతరం మునిసిపల్‌ ట్రావెలర్స్‌ బంగళా వద్ద అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన బహిరంగసభలో వివిధ రాజకీయ పక్షాలు, సాహిత్య, సాంస్కృతిక, ప్రజా సంఘాల నాయకులు ప్రసంగించారు. విరసం సభ్యులు నల్లూరు రుక్మిణి మాట్లాడుతూ రచయితలు క్రాంతి దర్శులని, వారి రచనలు సమాజాన్ని చైతన్యవంతం చేస్తాయని అన్నారు. సాహిత్యకారులపై దాడి హేయమైన చర్య అని అన్నారు. ఎపియుడబ్ల్యూజె జిల్లా అధ్యక్షులు ముష్కిల్‌ మాట్లాడుతూ తస్లీమాపైనే కాక పాత్రికేయులు, ఫోటోగ్రాఫర్లపైనా శాసనసభ్యులు స్వయంగా దాడి చేయటం అనాగకరిమన్నారు. ప్రజలకు ఆదర్శంగా ఉండవలసిన శాసనసభ్యులే దాడికి దిగటం హేయమైన చర్య అని, అందువలన వారు శాసనసభ్యులుగా కొనసాగేందుకు అనర్హులని పేర్కొన్నారు. ముస్లిం రచయితల సంఘం రాష్ట్ర కార్యదర్శి షేక్‌ కరిముల్లా ఇస్లాం మతసూత్రాల ప్రకారం చూసినా ఈ దాడి సమర్థనీయం కాదని అన్నారు. తమ సంఘం లౌకిక భావ వ్యాప్తి కొరకు కృషి చేస్తుందని అన్నారు. విప్లవ కార్మిక సమాఖ్య నాయకులు కొడవలి రాజేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ తస్లీమాపై దాడి చేయటం రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.

గుంటూరులో అరసం, విరసం, ఎ.పి.యు.డబ్ల్యు.జె. నిరసన ప్రదర్శన

గుంటూరులో అరసం, విరసం, ఎ.పి.యు.డబ్ల్యు.జె. నిరసన ప్రదర్శన


సభలో సిపిఐ నగర కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌, యు.సి.సి.ఐ. నాయకులు ఎం. రామమోహనరావు, ఎం.ఎల్‌. కమిటీ నాయకులు డాక్టర్‌ కొల్లా రాజమోహాన్‌, మహిళా సమాఖ్య, స్త్రీ విముక్తి సంఘటన, ప్రగతిశీల మహిళా సంఘాల నాయకులు కె. దేవసేన, శ్రీదేవి, గంగాభవాని, ఆంధ్రప్రదేశ్‌ నాట్యమండలి కార్యదర్శి గని, ముస్లిం రచయిత సయ్యదర్‌ నశీర్‌, ఇన్సాఫ్‌ నగర నాయకులు షేక్‌ సుభాని, లోక్‌సత్తా నగర నాయకులు ఎన్‌. అరవింద, ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్‌భాషానాయుడు, పిజియస్‌ఓ, పిడిఎస్‌యు జిల్లా శాఖల అధ్యక్షులు కె. దేవ, కె. రవి, ఎపిటియఫ్‌ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్‌.ఎస్‌.ఎస్‌. మూర్తి, డిటిఎఫ్‌ జిల్లా నాయకులు ఎల్‌. లక్ష్మారెడ్డి ఎపిసిఎల్‌సి నగర నాయకులు నరసింహారావు, హేతువాద సంఘం నాయకులు ఆర్‌. వెంకటేశ్వరరావు, గడుతూరి చంద్రం తదితరులు ప్రసంగించారు. ప్రదర్శనలో ప్రముఖ రచయితలు ఏ. తేజోపతి, ఏ. విఠల్‌రావు, ఆలూరి భుజంగరావు, లలిత, నాగరాజ్యలక్ష్మి, ఎ.వి.కె. సుజాత, సంగం డాక్టర్‌ టి. శరత్‌బాబు, అవగాహన కార్యదర్శి కె. శివరామిరెడ్డి, మాజీ కార్పొరేటర్‌ చదలవాడ జగన్నాధం, ఎ.పి.యు.డబ్ల్యూ.జె. జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వి. భాస్కరరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పత్తిపాటి రోశయ్య, న్యాయవాది గూడవల్లి నాగేశ్వరరావు, అరసం జిల్లా నాయకులు ఎ.ఎం.ఆర్‌. ఆనంద్‌, కె. శరత్‌, కారసాని రామకృష్ణారెడ్డి, విరసం జిల్లా కన్వీనర్‌ సంగ్రామ్‌, ఎ.ఎఫ్‌.టి.యు. నాయకులు ఎన్‌.వి. కృష్ణ, నూతలపాటి తిరుపతయ్య, పలు ప్రజా సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Comment

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో