వెరవను.. రచన ఆపను… తస్లీమా నస్రీన్‌

దాడులు చేస్తే వెనుకంజ వేయబోనని, ఏదేమైనా తన అభిప్రాయాల వ్యక్తీకరణను ఆపననీ బంగ్లా రచయిత్రి తస్లీమా నస్రీన్‌ స్పష్టం చేశారు. సాధారణ ప్రజల ఆదరాభిమానాలు తనకు అండగా ఉన్నాయని చెప్పారు. గురువారం హైదరాబాద్‌లో మజ్లిస్‌ నేతల దాడికి గురైన తర్వాత ఆమె హైదరాబాద్‌ విమానాశ్రయంలోనూ, కోల్‌కతా చేరిన తర్వాత ఫోన్లోను విలేఖరులతో మాట్లాడారు. “నేను ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాను. ప్రజాస్వామ్య పిపాసిగా ఈ దేశంలో సురక్షితంగా జీవించగలననే నమ్మకం నాకుంది. ప్రజాస్వామ్య బద్ధంగా మానవతా విలువల కోసం పోరాడటం నా నైజం. ప్రపంచంలో ఇలా ఆలోచించేవారు చాలామందే ఉన్నారు. వారందరి మద్దతు నాకుంది. నాపై దాడి చేసినవారు మైనార్టీలో (తక్కువ సంఖ్యలో) ఉన్నారు. తస్లీమా నస్రీన్నాకు మద్దతిస్తున్నవారు, నాపై సానుభూతి చూపిస్తున్నవారు మెజార్టీలో (పెద్ద సంఖ్యలో) ఉన్నారు. వారికి ధన్యవాదాలు” అని ఆమె అన్నారు. “తక్కువ మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న కొన్ని వర్గాలు నాకు ప్రమాదం తలపెటట్టాలని కోరుకుంటూ ఉండవచ్చు. దీనివల్ల నా గొంతు నొక్కేయగలమని అవి భ్రమపడుతూ ఉండవచ్చు. కానీ అది పొరపాటు ఆలోచన. ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నా నా పంథా మారదు. నేను నమ్మినదాన్ని నేను రాస్తూనే ఉంటాను. నా రచనల ద్వారా జాగృతి కలిగిస్తూనే ఉంటాను” అని ఆమె ఉద్ఘాటించారు. దాడి గురించి వివరిస్తూ… “పుస్తకావిష్కరణ సభకు నేను హాజరైనపుడు కొందరు అక్కడికి దూసుకువచ్చారు. నన్ను, నా రచనల్ని తిట్టడం మొదలుపెట్టారు. నాపై దాడికి దిగారు. కొందరు నాపై ఒక కుర్చీ విసిరేయడానికి ప్రయత్నించారు. చుట్టూ ఉన్నవారు అడ్డుకుని, నన్ను పక్కకు పంపకపోతే తీవ్రంగా గాయపడి ఉండేదాన్ని. తర్వాత నన్ను పోలీసులు సురక్షితంగా విమానాశ్రయానికి తీసుకువచ్చారు” అని ఆమె వివరించారు. “నాపై జరిగిన దాడి మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయదలచుకోలేదు. నాకు ఇప్పటికీ మైనార్టీలంటే సదభిప్రాయం, సానుభూతి ఉన్నాయి, అవి ఎప్పటికీ ఉంటాయి. ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. హైదరాబాద్‌లోని నా శ్రేయోభిలాషుల ప్రేమాభిమానాలు నన్ను కదిలించాయి. నేను నా సొంత ప్రజల మధ్యే నివసిస్తున్నాని ఇది నిరూపించింది” అని ఆమె అన్నారు.

భద్రతపై పరిశీలన : బెంగాల్‌ సర్కారు
తస్లీమాపై దాడితో పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆమెకు భద్రతపై పునఃస్సమీక్ష జరపనున్నట్లు ప్రకటించింది. తస్లీమా ప్రస్తుతం కోల్‌కతాలోనే ఉంటున్నారు. “మా ప్రభుత్వం ఆమెకు ఇప్పటికే గట్టి భద్రత కల్పిస్తోంది. అయినా తాజా పరిణామాల దృష్ట్యా దీన్ని మరోసారి సమీక్షిస్తాం” అని బెంగాల్‌ హోం కార్యదర్శి రాయ్‌ తెలిపారు.

Leave a Comment

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో