భూమి నవ్వింది… (సంపాదకీయం)

రాయలసీమ ప్రాంతంలో పాతతరం పెద్దలు అంటుంటారు
”నాది నీదే, నీది నీదే !
నాది నాదే, నీది నీదే !!
నీది నాదే, నాది నాదే !!!”
ఈ వాక్యాలు వర్తమాన సమాజానికి సరిగ్గా సరిపోతాయి. కొంచెం వివరంగా చెప్పాల్సి వస్తే…
రెండు తరాల క్రితం… ”అయ్యా ! ఈ భూమి మీదని తెలిసింది. నాకేమో ఏ భూమి లేదు. మీరు దయపెట్టి కొంచెం భూమి ఇస్తే సాగు చేసుకొని జీవిస్తానయ్యా” దీనంగా అడిగాడు పేదవాడు.
”దానికేం భాగ్యం ! భూమిపైన హక్కు అంటూ వుంటే ఆ దేవునికి వుంటుంది. నాకు హక్కు వుందంటే భూమి నవ్వుతుంది. నీకిష్టమున్నంత భూమి బాగు చేసుకొని బతుక్కోపో.- నాది నీదే !, నీది నీదే ” అన్నాడు పెద్దవాడు.
ఒక తరం క్రితం… ఎవరి శక్తి మేర వారు భూమిని సాగు చేసుకొని జీవిస్తున్నారు ఇద్దరు పేదలు. ఆ భూమి తమది కాదు. తమ ఇద్దరిలోనే ఎవరో ఒకరు రెండవ వ్యక్తి భూమి తీసేసుకుంటారనే అనుమానం వారిని వేధించేది. చివరికి రచ్చబండ కాడ చేరి చర్చించుకున్నారు. ఆ ఇద్దరిలో కొంచెం తెలివి గల పేదోడు ఇలా అన్నాడు ”నాది నాదే, నీది నీదే !” అన్నాడు. సాగు చేసిన ప్రకారం భూమి పంచుకొన్నారు.
ఈ తరం… ”రెండు తరాల నుంచి సాగు చేసుకొని జీవిస్తుండావా ? కాబట్టించుకోకుండ వుండినాం. కాబట్టి చెలాయించుకొన్యావ్‌. ఇంక ఈ భూమి… ”నీది నాదే, నాది నాదే – పా..పా.. కథలు పడితే ఖూని అయిపోతావ్‌ పోరా… పో.” -
ఈ వాక్యాలు ఇప్పుడు ఏ విషయానికి వర్తించవో చెప్పండి.

-శశిశ్రీ

Leave a Comment

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో